telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కేవలం ఐదు జిల్లాల్లోనే కరోనా కేసులు!

corona

తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 67 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వియరస్ సోకి నిన్న ఒకరు ఒకరు మరణించారు. మరో 65 మందిక చికిత్స పొందుతున్నారు. ఇక ఈ కేసులన్నీ రాష్ట్రంలోని కేవలం ఐదు జిల్లాల నుంచి మాత్రమే వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసున్న వారు, వారి ఇరుగు, పొరుగు వారిలోని వారికి సోకినవే. వీటిల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ లో బయటకు వచ్చినవే 61 కేసులు ఉన్నాయి.

హైదరాబాద్, కరీంనగర్, భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో మినహా తెలంగాణలో మరే ప్రాంతంలోనూ ఇంతవరకూ ఒక్క కేసు కూడా బయట పడలేదు. దీంతో మిగతా జిల్లాలకు వ్యాధిని సోకకుండా చూసే విషయంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండటం, జన సాంద్రత అధికం కావడం తదితర కారణాలతో వ్యాధి విస్తరణ గ్రేటర్ హైదరాబాద్ లో అధికంగా ఉంది. ఇప్పటికే అధికారులు శంషాబాద్, కోకాపేట తదితర ప్రాంతాల్లోని సుమారు 2,400 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

Related posts