తాగిన మత్తులో తోడబుట్టిన అన్న అత్యాచారం చేయడంతో మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ జ్యోతి నగర్‌లో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జ్యోతినగర్‌కు చెందిన 17 ఏళ్ల యువతిని ఇంట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే యువతికే ఇప్పటికే పెళ్లి సంబంధం కుదిరింది. ఆమె మైనర్ కావడంతో వచ్చే ఏడాది పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.
యువతి బాధ్యతలను ఆమె సోదరుడికి తల్లిదండ్రులు అప్పజెప్పి వెళ్లిపోయారు. అయితే తాగిన మత్తులో సొంత చెల్లెలు అని కూడా చూడకుండా రేప్ చేశాడు. అంతే కాదు తన స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి పురుగులమందు తాగింది. గుర్తించిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.