telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నితిన్ ‘చెక్’ విడుదల తేదీ వచ్చేసింది…

Check

నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న వేసవి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. అయితే ఇంతలో నితిన్ తన తరువాతి సినిమా చెక్ మొదలు పెట్టేశాడు. నితిన్ కెరీర్‌లో 28వ సినిమాగా ‘చెక్’ రాబోతుంది. ఈమేరకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 19న ‘చెక్’ ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్. కాగా గతేడాది హీరో నితిన్ ‘భీష్మ’ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తరువాత నితిన్ కి ఈ సినిమా సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నితిన్ డిఫరెంట్ మూవీగా ‘చెక్’ చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమద్యే రిలీజ్ అయిన టీజర్ లో.. ఖైదీగా నితిన్‌ని చూపిస్తూ ఆయనకు చెస్ ఆడే టాలెంట్ ను చూపించారు. ఈ సినిమా టీజర్ బట్టి చుస్తే నితిన్ మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు నితిన్. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలు ప్రేక్షకునికి దగ్గరగా ఉండడం కలిస్తోందనే చెప్పాలి.

Related posts