telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మిగతా కులాలు మాట తప్పుతాయా?: జగన్ పై పవన్ ఫైర్

pawan-kalyan

తన మతం మానవత్వం అని, తన కులం మాట తప్పదని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. మరి మిగతా కులాలు మాట తప్పుతాయా అని పవన్ జగన్ ను ప్రశ్నించారు. మిగతా మతాలు మానవత్వం నేర్పడంలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటూ మండిపడ్డారు. తిరుపతిలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ జైల్లో 100 రోజులు ఉండి బయటికివచ్చిన తర్వాత మొండిగా తిరిగి సీఎం అయినప్పుడు, ప్రజాసమస్యలపై మొండిగా నేనెందుకు తిరగలేనని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా వైసీపీ మంత్రులపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. చట్టాలు కాపాడాల్సిన మీరే పిచ్చికూతలు కూస్తుంటే రోడ్లపైన తిరిగే కుర్రాళ్లకు మానభంగం వంటి ఆలోచనలు రాక ఇంకేం వస్తాయని ప్రశ్నించారు. సమస్యలు కనిపిస్తుంటూ చూస్తూ ఊరుకోలేనని, మనస్సాక్షితో సమస్యల పట్ల స్పందిస్తానని తెలిపారు. సమస్యలు ఎదురైతే కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని అన్నారు. తాను రాజకీయాల్లోకి తెగించే వచ్చానని స్పష్టం చేశారు.

Related posts