telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకలో కూలిన కూటమి ప్రభుత్వం..బల పరీక్షలో కుమారస్వామి ఓటమి

CM Kumaraswamy killing order

కర్ణాటకలో ఎట్టకేలకు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కర్ణాటక విధానసభలో ఈరోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం డిపోవడంతో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై స్పీకర్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సభలో హాజరైన సభ్యుల బలం ప్రకారం మేజిక్ ఫిగర్ 103గా నిర్ణయించారు.

అయితే బలపరీక్షకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు పడటంతో బలపరీక్ష వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా స్పీకర్ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఓటవి చవిచూడగానే ప్రభుత్వ సదుపాయాలు కుమారస్వామి వదులుకున్నారు. కాలినడకనే రాజ్‌భవన్‌కు వెళ్లడానికి సిద్ధపడ్డారు. రాజ్‌భవన్‌కు చేరగానే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ వాజూభాయ్ వాలాకు అందజేస్తారు. విశ్వాసపరీక్షలో నెగ్గిన బీజేపీ, కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Related posts