తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నూతన మున్సిపల్ నూతన చట్టంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త మున్పిపల్ చట్టంతో పూర్తి పారదర్శకత వస్తుందని తెలిపారు. 75 చదరపు గజాలలోపు జీప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి అవసరం లేదన్నారు. 75 గజాల లోపు కట్టుకున్న ఇంటికి ఆస్తిపన్ను కేవలం రూ.100 మాత్రమే. 75 గజాల లోపు కట్టుకున్న ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కేవలం ఒక రూపాయేనని సీఎం కేసీఆర్ తెలిపారు.
అక్రమమైన బిల్డింగ్ కడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాంమని చెప్పారు. కొత్త చట్టం కఠినంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాలకు రూ.1600 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1030 కోట్లు వస్తున్నాయన్నారు. 500 జనాభా ఉండే చిన్న గ్రామానికి కూడా నిధులు పుష్కలంగా వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం వచ్చే నిధులకు సమానంగా మనం కూడా సమకూర్చుకుంటామన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండదని చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పించామని పేర్కొన్నారు.
ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తుంది: హరీష్ రావ్