telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో కొత్త కరోనా లక్షణం…

corona covid

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ బాధితుల్లో ఇలాంటి లక్షణాలు లేకున్నాను.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఇప్పటివరకు కరోనా లక్షణాల్లో జలుబు, రుచి తెలియకపోవటం, వాసన గుణాన్ని గుర్తించకపోవటం, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి సమస్యలు ప్రధానంగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి. అయితే ఈ లక్షణాలే కాకుండా మరో లక్షణం కూడా కరోనా సోకిన వారిలో కనిపిస్తున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైంటిఫిక్‌ జర్నల్‌పరిశోధకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన అధ్యయనాల్లో కోవిడ్‌-19 వైరస్‌ సోకిన వారిలో నోటిలో తడి ఆరిపోవడం వంటి లక్షణం కనిపిస్తుందట. గొంతు ఎండిపోవడం వల్ల వైరస్ నుంచి కాపాడే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుందట. దీంతో గొంతులో మంట పుట్టే లక్షణం కనిపిస్తుందట. ప్రస్తుతం వేసవి కూడా తోడు అవ్వటంతో శరీరం కూడా సహజంగానే లాలాజల శక్తిని కోల్పోతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుచేత వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts