telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

సోను సూద్ పేరుతో భారీ మోసం…

Sonu-Sood

ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు భారీగా జరుగుతున్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా.. సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా  సోను సూద్ ఫౌండేషన్ పేరుతో సైబర్ నేరగాడి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో తన మొబైల్ నెంబర్ ను సోను సూద్ నెంబర్ గా ఉంచిన సైబర్ నేరగాడు… సాయం కోసం ఆశ్రయించిన మాదాపూర్ వ్యక్తిని దారుణంగా మోసం చేశాడు. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 60 వేలు వసూలు చేసాడు సైబర్ నేరగాడు పంకజ్ సింగ్. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. డబ్బులు చెల్లించినా ఎంతకీ సాయం అందకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యప్తు చేపట్టారు.

Related posts