దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ రోజు ఉదయం ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…కంటికి కన్పించని శత్రువుపై పోరాటం చేస్తున్నామని, అంతిమ విజయం మాత్రం వైద్యులదేనని మోదీ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల పాత్ర కీలకమని చెప్పారు.
కరోనా యోధులు నిరంతరం కష్టపడుతున్నారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. కరోనాపై పోరాటంలో భారత్ ముందుందని చెప్పారు. ఆరోగ్యసేతు యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగామోదీ నేతృత్వంలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.