telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతీ సినిమాలో నీతోనే రొమాన్స్ చేయాలని ఉంది… స్టార్ హీరో కామెంట్స్

Kareena

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తు్న్నారు. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. పోస్టర్‌లో ఆమిర్ కరీనాను హగ్ చేసుకుంటున్నట్లు కనిపించారు. దీని గురించి ఆమిర్ మీడియాతో మాట్లాడుతూ… ‘నాకు ప్రతీ సినిమాలో కరీనాతోనే కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. ఎందుకంటే తనతో రొమాన్స్ నాకు నేచురల్‌గా వచ్చేస్తుంది. కరీనాకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’’ అని తెలిపారు. గతంలో ఆమిర్‌తో కలిసి కరీనా ‘త్రీ ఇడియట్స్’, ‘బాంబే టాకీస్’, ‘తలాష్’ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా హాలీవుడ్‌లో 1994లో వచ్చిన ‘ఫారెస్ట్ గ్రంప్’ సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts