telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై.. దక్షిణ కొరియా బృందం దర్యాప్తు!

vishakha gas leak

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం దక్షిణకొరియా నుంచి ఓ ప్రత్యేక బృందం భారత్ కు బయలుదేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందంలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్టు తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్ కు గల కారణాలను విశ్లేషించనున్నారు. అధెవిధంగా గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరిస్తోంది.

Related posts