సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చట్టవిరుద్దమని అన్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సూచించారు. సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బదులు ఇచ్చారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చట్టవిరుద్దమని అన్నారు. ఉన్నతస్థానాల్లో ఉన్నవారే స్థానిక ఎన్నికల్ని అడ్డుకుంటున్నారని… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారంటూ… గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్న రమేశ్‌కుమార్…. రాజ్యాంగ స్ఫూర్తిని అతిక్రమించకుండా ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి, ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు… స్థానిక సంస్థల ఎన్నికలకు అవరోధం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు… ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు భయపడుతున్నారంటూ… వారిలో ఊహాజనితమైన భయాలు రేకెత్తించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలా చేయడం అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని… నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నట్టు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరంఉద్యోగుల నుంచి ఎలాంటి ఆందోళనా లేకపోయినా, ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు కావాలనే వారిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని…. దాన్ని తీవ్రంగా పరిగణించాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేశ్ కోరినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే… కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడంపైనా నిమ్మగడ్డ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పక్రియను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం.గవర్నర్‌తో భేటీఈ ఉదయం పదకొండున్నర గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్‌ను… ఎస్ఈసీ రమేశ్‌కుమార్ కలవనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని హైకోర్టు ఆదేశించినా… ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. రాజ్యాంగ స్ఫూర్తిని, నిబంధనల్ని అతిక్రమించకుండా ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తారని తెలిసింది.ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండిస్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు కుదరదని… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రమేశ్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల… రిజర్వేషన్ల స్వరూపం మారిపోతుందన్నారు. అలాగే ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా వారిని బదిలీ చేయడం వల్ల కూడా… ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుందన్నారు. ఒకవేళ ఎన్నికలకు విఘాతం కలగకుండా జిల్లాల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉంటే ఎన్నికల సంఘానికి చెప్పాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికలు ముగిశాకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.