telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత కీలక సందేశం

గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు కూడా ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 1న గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారానికి సరిగ్గా రెండు వారాల సమయం కూడా లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద సవాలుగా మారాయి. దుబ్బక ఓటమి తర్వాత.. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికలలో బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చూపించాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగాడు. అయితే.. ఈ గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ కవిత కీలక సందేశం ఇచ్చారు. “టీఆర్ఎస్ పాలనలో మన హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత ఆరేళ్లలో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి, పెట్టుబడులకు ముఖద్వారంగా నిలిపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి డిసెంబర్ 1 వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేద్దాం! ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం!” అంటూ కవిత పేర్కొన్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌ను గ్రేటర్‌ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

Related posts