telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యతో కయ్యానికి దిగనున్న నారా హీరో..!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. బాలకృష్ణ బిబి3 మూవీలో నారా రోహిత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్త హల్ చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న యంగ్‌ పాత్ర కోసం పలుగురిని పరిశీలిస్తుండగా.. నారా రోహిత్‌ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. బిబి3పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Related posts