telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ ఓటీటీ సంస్థతో గుణశేఖర్ వివాదం… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Gunasekhar

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలను, క‌ళ్లు చెదిరే సెట్స్‌తో అద్భుతంగా తెర‌కెక్కించే ఆయన ప్రతిభ కన్పిస్తుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గురించి నిన్నటి నుండి ఒక వార్త మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. అయితే ఆయన ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లి‌క్స్‌తో ఒక వెబ్ సిరీస్ కోసం డీల్ కుదుర్చుకున్నారని, ఒప్పందం మేరకు వెబ్ సిరీస్ కంటెంట్ ను నెట్‌ఫ్లి‌క్స్‌ వారికి పంపించారని, కానీ అది వాళ్లకు నచ్చలేదని, అందుకే రిజెక్ట్ చేశారని వార్తలు వెలువడ్డాయి. దీంతో నేరుగా గుణశేఖర్ స్పందించారు. అసలు తాను నెట్‌ఫ్లి‌క్స్‌ సంస్థతో కానీ వేరే ఓటీటీ సంస్థతో కానీ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, అసలు తనకు ఆ స్ట్రీమ్ మీద ఆసక్తే లేదని, పుకార్లను నమ్మవద్దని, త్వరలోనే తన నుండి ఒక అప్డేట్ రానుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అన్ని రూమర్లకు చెక్ పడ్డట్టైంది. కాగా గుణ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి చిత్రం “హిరణ్యకశిప”కు సంబంధించిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌హ్లాదుడి తండ్రి అయిన రాక్ష‌స‌రాజే ఈ హిరణ్యక‌శ్య‌ప‌. విష్ణుమూర్తి ద్వేషి అయిన ఈ రాక్ష‌స‌రాజు సంహారం కోస‌మే మ‌హావిష్ణువు న‌ర‌సింహ అవ‌తారం ఎత్తాడు. ఈ పౌరాణిక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు మూడేళ్లుగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి టైటిల్ రోల్ పోషించనున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Related posts