telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త పార్టీపై షర్మిల అనుచరుడు సంచలన వ్యాఖ్యలు !

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే సంకేతాలు రావడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ వ్యక్తులు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని ఇక్కడి పార్టీలు అంటుంటే.. అటు ఏపీలో స్వయంగా వైసీపీ పార్టీయే షర్మిల పార్టీని వ్యతిరేకించింది. అయితే.. తాజాగా కొత్త పార్టీపై షర్మిల అనుచరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసమే షర్మిల పార్టీ పెట్టనున్నారని ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ సీపీతో షర్మిలకు సంబంధం లేదని, అసలు తెలంగాణలో వైసీపీ లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఒకరికి తోక పార్టీగా ఉండేందుకు తాము సిద్ధంగా లేమని… అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. వైఎస్ సెంటిమెంట్ గా చేవెళ్ల, నల్గొండ నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేసామని… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణం.. షర్మిల కాదని.. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా వస్తున్నామని స్పష్టం చేశారు. చేతకాని నాయకులు, కేసులు ఉన్న నిందితులు కూడా షర్మిలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Related posts