telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఉమ కు కొడాలి సవాల్…

Devineni kodali

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. సోమవారం నాని చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమంటూ.. విజయవాడలోని గొల్లపూడి సెంటర్‌కు వచ్చిన దేవినేనిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఇదే.. సమయంలో.. మరోసారి ఉమకు బహిరంగ సవాల్‌ విసిరారు. తాను చర్చకు రమ్మంటే.. దీక్ష, ఆందోళన అంటూ దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  తాను ఫోన్‌ చేసినా దేవినేని ఉమ స్పందించలేదన్నారు మంత్రి కొడాలి నాని.. కానీ, కావాలనే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.. బహిరంగ చర్చకు పోలీసులు అంగీకరించరని తెలిసే.. ఇలా రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చవటల్లో దేవినేని ఉమ నంబర్‌ వన్‌ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. దేవినేనికి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు.. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దాం.. అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానంటూ హాట్‌ కామెంట్లు చేశారు. ఇక, ఉమ సొల్లు కబుర్లు చెబుతాడు.. రాత్రి నుండి 10 సార్లు ఫోన్ చేశా.. బహిరంగ చర్చకు సిద్ధమని.. కానీ, ఫోన్ తీసి మాట్లాడే దమ్ముకూడా ఉమకు లేదంటూ సెటైర్లు వేశారు. చూడాలి మరి ఈ రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది.

Related posts