telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సిరీస్ భారత్ దే…

ఆసీస్ ఠీ జరిగిన నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించింది. అయితే భారత్-ఆసీస్ మధ్య చివరి టెస్ట్ చివరి రోజు ఆట ఉత్కంతంగా సాగింది. అయితే నిన్న వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసిన భారత్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ(7) పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్ అర్ధశతకంతో రెచ్చిపోయాడు. 91 పరుగుల వద్ద ఔట్ అయిన గిల్ 9 పరుగుల దూరంలో తన మొదటి సెంచరీని మిస్ అయ్యాడు. ఆ తర్వాత త్వరగా పరుగులు చేయాలనే ఉదేశ్యంలో కెప్టెన్ రహానే(24) కూడా వెనుదిరిగాడు. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న పుజారాతో కలిసి పంత్ చెలరేగిపోయాడు. అయితే అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత పుజారా ఔట్ అయిన తర్వాత కూడా పంత్ తన దూకుడును కొనసాగించాడు. పుజారా ఔట్ అయిన కాసేపటికే మరో ఆటగాడు మయాంక్ కూడా పెవిలియన్ కు చేరుకున్నాడు.

ఇక భారత్ విజయానికి చివరి 10 ఓవర్లలో 53 పరుగులు కావాల్సి ఉండగా కొత్తగా బ్యాటింగ్ కు వచ్చిన సుందర్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి 22 పరుగులు ఔట్ అయ్యాడు.ఇక విజయానికి మరో మూడు పరుగుల అవసరం అనగా శార్దుల్ ఠాకూర్(2) రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కానీ చివర్లో ఫోర్ బాది భారత్ ను విజయ తీరాలకు చేర్చిన పంత్(89) పరుగులతో నాట్ ఔట్ గా నిలిచాడు. దాంతో చివరి టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో విజయ సాధించిన టీం ఇండియా 4 టెస్టుల ఈ సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకుంది. దాంతో మాజీ ఆటగాళ్లు అందరూ జట్టు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts