telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అశ్వథ్థామ‌” పచ్చబొట్టు వేసుకోవడానికి కారణమిదే… : నాగశౌర్య

Naga-Shourya

యంగ్ హీరో నాగశౌర్య ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వథ్థామ‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 31న విడుద‌ల కానుంది. మెహ‌రీన్ హీరోయిన్‌. ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా నాగ‌శౌర్య సినిమా గురించి మాట్లాడుతూ – “ఈ సినిమా క‌థ‌ను ఎమోష‌న‌ల్‌గా ఫీలై రాసుకున్నాను. న‌టించేట‌ప్పుడు కూడా ఎమోష‌న‌ల్‌గానే ఫీల‌య్యాను. క‌థ నా గుండెకు అంత‌గా తాకింది. రేపు ప్రేక్ష‌కులు కూడా అదే ఫీల‌వుతారు.అన్ని ర‌కాలుగా నాకు న‌చ్చిన ఈ సినిమా టైటిల్‌ను ప‌చ్చ‌బొట్టుగా పొడిపించుకున్నాను. ఈ సినిమా వ‌ల్ల నిర్మాత‌గా నాకెన్ని డ‌బ్బులు వ‌స్తాయేమో కానీ.. మంచి పేరొస్తుంది. ఈ అనుభ‌వాల‌ను, జ్ఞాప‌కాల‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను” అన్నారు.

Related posts