telugu navyamedia
సినిమా వార్తలు

“గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగం అవుతా… ప్రామిస్ చేస్తున్నా… : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

నేడు జూలై 24న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ “గిఫ్ట్ ఏ స్మైల్” అనే ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎం.పి నిధుల‌తో ఎకో టూరిజం పార్కుగా తీర్చిదిద్ద‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈ క్ర‌మంలో ఛాలెంజ్‌ని స్వీక‌రించిన‌ హీరో నితిన్ త‌న పెర‌ట్లో ఓ మొక్క‌ని నాటాడు. దీనిపై ట్విట్ట‌ర్ ద్వారానే విజ‌య్‌దేవ‌ర‌కొండ స్పందించారు. “కె.టి.ఆర్ అన్న‌కు హ్యాపీ బ‌ర్త్ డే. సంతోష్ అన్న మీరు చెప్పిన కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌వుతాను. నేను కూడా ఓ మినీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నాను. ప్రాక్టిక‌ల్‌గా ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటాను. వలంటీర్స్‌తో ఓ చిన్న గ్రూప్‌ను ఏర్పాటు చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తాను” అంటూ తెలిపారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Related posts