telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ 152… సెట్లో కారవాన్ల సందడి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ని నిర్మాతగా మార్చి.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై 50 కోట్ల బడ్జెట్లోనే ‘ఖైదీ నంబర్ 150’ని తీయించాడు చిరంజీవి. ఇక.. ఈ సినిమా బడ్జెట్కి రెట్టింపు లాభాలు దక్కాయి. కానీ.. ‘సైరా’ విషయంలో చిరు గురి తప్పింది. తాజాగా చిరంజీవి 152 చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్లో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. ఇక.. పెద్ద హీరో సినిమా అంటే కారవాన్ల సందడి గురించి చెప్పక్కర్లేదు. కానీ.. మామూలుగా అగ్ర హీరోల సినిమాలలో ఉపయోగించే కారవాన్ల కంటే.. ఈ చిత్రానికి రెండింతలు కారవాన్లు వాడుతున్నారట. ఈ పాట చిత్రీకరణలో చిరంజీవి-కొరటాలతో పాటు.. డాన్స్ మాస్టర్, కెమెరామేన్ రత్నవేలుకి సెపరేటుగా కారవాన్లు ఉన్నాయి. వీరితో పాటు.. రత్నవేలు టీమ్లో ప్రధాన సిబ్బందికి ఓ కారవాన్, కాస్ట్యూమ్స్ డిజైనర్ సుస్మితకు ఓ కారవాన్.. నిర్మాత హోదాలో అప్పుడప్పుడూ వచ్చే రామ్ చరణ్ కోసం మరో కారవాన్ను ఏర్పాటు చేశారట ప్రొడక్షన్ బృందం. అలా.. చిరంజీవి షూటింగ్ మొత్తం కారవాన్ల సందడితో నిండిపోయిందట. మరి.. బడ్జెట్ కంట్రోల్ విషయంలో కచ్చితంగా ఉండే మెగాస్టార్ దృష్టికి.. ఈ కారవాన్ల విషయం వచ్చిందో? లేదో? అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.

Related posts