telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మూడు రోజులో మరో అల్పపీడనం…

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయ్యింది.  వర్షాల ధాటికి శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి.  ఇంకా అనేక కాలనీలు బురదలోనే ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.  భారీ వర్షాలకు హైదరాబాద్ లోని చెరువులు పూర్తిగా నిండాయి.  గత వారం రోజుల వ్యవధిలో నగరంలో 700 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాల నుంచి ఏపీ, తెలంగాణ ఇప్పడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాగాల 2 రోజుల్లో మొత్తం దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో అక్టోబర్ 29 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో  ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Related posts