telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్ : ఎండ్ గేమ్” విడుదలకు ముందే లీక్

Avengers-4

“అవెంజర్స్ : ఎండ్ గేమ్” ప్రపంచ సినీ అభిమానులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రమిదే. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థార్, బ్లాక్ విడో, వార్ మెషీన్, కెప్టెన్ మార్వెల్ తదితరులు థానోస్ ను ఎలా ఎదుర్కొంటారో చూసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో వారాంతం వరకూ టికెట్ల బుకింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక నిన్న ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభం కాగా, హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ సుమారు కిలోమీటర్ దూరం సాగడం గమనార్హం.

దేశంలో మొత్తం 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఒక హాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో ఇండియాలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఇలాంటి సినిమాకు తమిళరాకర్స్ షాక్ ఇచ్చింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం సినిమాను ఆన్ లైన్ లో లీక్ చేశారు. దీంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. విపరీతమైన క్రేజ్ ఉన్న ఇలాంటి సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అయితే ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పడుతుందని భయపడుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. మార్వెల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులెవరూ కూడా పైరసీలో సినిమాను చూడరని.. థియేటర్ కి వెళ్లే ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. తొలిరోజు ఈ సినిమా నలభై కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Related posts