telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టిక్ టాక్”లోకి బిగ్ బాస్ ఎంట్రీ… ఒక్కరోజులో 4 మిలియన్ల ఫాలోవర్స్

Rashmi

హిందీ’ బిగ్‌బాస్‌ 13′ కంటెస్టెంట్‌ రష్మీ దేశాయ్‌ ఇటీవల టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ఒక్క రోజులోనే ఆమె భారీ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా ఎంతోమంది స్టార్‌లుగా కూడా మారిపోయారు. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సైతం ‘టిక్‌టాక్’‌లో రచ్చ చేస్తున్నారు. ఫన్నీ వీడియోలతో పాటు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. మే 7న ఈ బ్యూటీ టిక్‌టాక్‌లోకి రాగా.. ఒక్క రోజులోనే 4 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దీంతో ఆమెకు ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. కాగా గతేడాది జరిగిన బిగ్‌బాస్ 13లో పాల్గొనడం ద్వారా రష్మీ బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా రష్మీ, అర్హన్ ఖాన్ లవ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక బిగ్‌బాస్ 13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లాకు చివరి వరకు రష్మీ దేశాయ్ గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే.

Related posts