తెలంగాణలో ఈ మధ్య కాలంలో మిస్సింగ్ కేసులు అధికం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ మిస్సింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా సూర్యాపేటలో ఓ బాలుడు అదృశ్యం అయ్యాడు. దీపావళి రోజునే ఈ ఘటన జరగడంతో… స్థానికంగా కలకలం రేపుతోంది. దీపావళి టపాసులు కొనడానికి వెళ్లిన ఐదేళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట, భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పరికపల్లి మహేష్, నాగలక్ష్మి దంపతలు ఏకైక కుమారుడు గౌతమ్ నిన్న రాత్రి తప్పిపోయాడు. దీపావళి సందర్భంగా రాత్రి సమయంలో టపాసుల కోసం పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి సైకిల్ పై వెళ్లాడు గౌతమ్. తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. బాలుడు తీసుకెళ్లిన సైకిల్ మాత్రం కిరాణా షాపునకు కొద్ది దూరంలో కనిపించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారే ఈ మిస్సింగ్ వెనుక ఉంటారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post