telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గంగవ్వ..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షించి కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది. ఈ చాలెంజ్ మహా ఉద‌్యమంలా ముందుకు పోతున్నది.  ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి తన గ్రామంలోని పకృతి వనంలో మొక్కలు నాటిన మై విలేజ్ షో ; బిగ్ బాస్ సీజ‌న్ 4 భాగస్వామురాలు గంగవ్వ.  ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజలో భాగముగా తాను ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కను నాటనన్నారు. మొక్కలను నాటడంతో వాతావరణం లో సమతుల్యత ఏర్పడుతుందన్నారు.  వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts