telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇక తండ్రిని కావడమే మిగిలింది… : సల్మాన్

Salman-KHan

నిన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ రోజున సల్మాన్‌కు జీవితంలో మర్చిపోలేని కానుక దొరికింది. తన సోదరి అర్పితా ఖాన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంతకుముందే అర్పితకు కుమారుడు ఉన్నాడు. దీని గురించి సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ… “నా చెల్లెలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు ఆయత్ శర్మ అనే పేరు పెట్టాం. నా పుట్టినరోజు నాడు ఉదయం లేవగానే ఆ చిట్టితల్లి ముఖం చూశాను. అది బెస్ట్ విషయం. ఇక ప్రతీ డిసెంబర్ 27న నా మేనల్లుడు, మేనకోడలితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటా. నేను మామనయ్యాను, బాబాయిని అయ్యాను. ఇక తండ్రిని అవ్వడం మాత్రమే మిగిలుంది” అని వెల్లడించారు. ఇప్పటికే సల్మాన్ సరోగసీ ద్వారా తండ్రి కాబోతున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి.

Related posts