telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మరో కొత్త పథకం..”కేసీఆర్‌ ఆపద్భంధు” పేరుతో

తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకురాబోతోంది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారిత కోసం కోత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీల సంక్షేమం కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో రూ. 5200 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. అందులోనూ అత్యంత వెనుకబడిన వర్గాలు, బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే దిశలో “కేసీఆర్‌-అపద్భంధు” పేరుతో కార్యాచరణ రూపొందిస్తోంది. ఎంబీసీల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం అంబులెన్స్‌లు మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాల్లోని బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి వారికి అధునాతన పరికరాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చడం, కొన్ని బీసీ కార్పొరేషన్‌ సంచార పద్దతిలో కొనసాగించే వృత్తులను సులభతరం చేసేందుకు గానూ వాహనాలు సమకూర్చడం, మరికొన్ని కులాల వారికి వృత్తి పనిముట్లను పంపినీ చేయడం లాంటి కార్యక్రమాలను బీసీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్‌ 27 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ త్వరలో విధివిధానాలు ఖరారు చేయనుంది.

Related posts