telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు .. ‘హికా’ తుపాను హెచ్చరికలు ..

hikka cyclone alert to telugu states by IMD

ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగు వార్త, హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హికా తుపాను ప్రభావంతో.. అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ.. చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. మరో.. 48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ, రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌ఘడ్, బెంగాల్‌లో కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలిండియా వార్నింగ్ బులెటిన్‌లో.. వాతావరణశాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, బెంగాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Related posts