telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ : .. హైదరాబాద్ లో .. కుండపోత వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..

huge rain in hyderabad troubles normal life

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో.. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో హహనదారులు ఎటూ కదల్లేక గంటలపాటు రోడ్ల పైనే ఉండిపోయారు. వర్షం కారణంగా మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.

మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాలకు నగరంలోని హోర్డింగులు, పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. ఫెక్సీలు చిరగడం, హోర్టింగులు పడకుండా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Related posts