అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమరావతి నుంచి రాజధాని మారుస్తున్న మన జగన్ అన్న పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు అని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా తేల్చి చెప్పారు’ అంటూ ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు.
రాజధాని కోసం 33,000 ఎకరాల భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు రాజధాని మారుస్తున్నారంటూ ఆ వీడియోలో శేఖర్ గుప్తా తెలిపారు. ఇన్ని ఎకరాలు సేకరించినప్పటికీ రాజధాని నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. విషపూరిత రాజకీయాల వల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.