టీఆర్ఎస్ నేత కవిత నియోజక వర్గం నిజామాబాద్ లో రైతుల పోటీకి ఆమె వెనకడుగు వేయక తప్పని పరిస్థితి. దీనితో ఆమెను కేసీఆర్ అక్కడ నుండి తప్పించాడు. అంతేకాకుండా, ఇప్పటి వరకూ నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలిగా ఉన్న ఆమెను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు సమాచారం. కవితను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తుండటం విశేషం.
నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ నేత, అల్లుడు అనిల్ పోటీ చేస్తారని కేసీఆర్ తాజాగా వెల్లడించాయి. ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రేపు ప్రకటించనున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలోనే ప్రస్తుత సిట్టింగ్ లోక్ సభ సభ్యులను మార్చాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా? లేక ఎమ్మెల్సీగా రంగంలోకి దించుతారా? అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
గాంధీల కుటుంబాలపై విమర్శలు చేయకుడదా ..?