telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

హైదరాబాద్ : … 102లో కెప్టెన్‌ … ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

applications invited for captain jobs in 102

జీవీకే ఈఎంఆర్‌ఐ 102లో కెప్టెన్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీవీకే ఈఎంఆర్‌ఐ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ సుహాస్ చరణ్ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత ఉండాలని, ఎల్‌ఎంవీ, విత్ ట్రాన్స్‌పోర్టు బ్యాడ్జ్, హెచ్‌టీవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్‌లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలని, 22-35 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎత్తు 5.4 అంగుళాలు, తెలుగు, ఇంగ్లిష్ చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలన్నారు.

ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనివేళలు ఉంటాయని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. 26న (గురువారం) డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో కింగ్‌కోఠిలోని జీవీకే ఇఎంఆర్‌ఐ 108 కార్యాలయం నందు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9000012214, 8143335660 సంప్రదించవచ్చన్నారు.

Related posts