telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్…

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై ఈరోజు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం గర్వంగా ఉందని, అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ రహిత భారత్ గా మన దేశాన్ని తీర్చిదిద్దాలని ఆమె కోరారు. పుదుచ్చేరిలో ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ని లెఫ్టినెంట్ గవర్నర్ హోదాతో డాక్టర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా తను కూడా మొదటి డోసు తీసుకున్నారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా ఉందని, వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, పంపిణీలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని గవర్నర్ అన్నారు. అయితే ఇప్పటికే చాలా మంది రాజకీయనాయకులు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.

Related posts