telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ పుట్టుక నాది.. బ్ర‌తుకంతా మీది..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అమిత‌మైన ప్రేమ‌. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు కేసీఆర్‌పై ఉన్న ఇష్టాన్ని, తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు.

Dailyhunt

సంతోష్ కుమార్ మంగళవారం తన 44వ పుట్టిన రోజు సంద‌ర్భంగా సంతోష్ కుమార్ ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. కేసీఆర్‌ తనను చిన్నప్పుడు భుజాలపై ఎత్తుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ..‘‘ఈ పుట్టుక నాది.. బ్ర‌తుకంతా మీది..’’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

https://www.joginipallysantoshkumar.com/

అంతేకాకుండా ..ట్విట‌ర్ వేదిక‌గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ ప్రముఖులుప‌ర్య‌వ‌ర‌ణ ప్రేమికులు సంతోష్ కుమార్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో సంతోష్‌ కుమార్‌ నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలతో చెట్లను నాటిస్తూ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్నారు సంతోష్ కుమార్‌. త‌న పుట్టిన రోజున పుర‌స్క‌రించుకొని ఉప్పల్ భ‌గాయ‌త్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.

Related posts