telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె విరమణతో మేము రోడ్డున పడ్డాం..ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన

rtc protest started with arrest

తెలంగాణలో ఆర్టీసీ చేపట్టిన సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసిన ఉద్యోగులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. దిల్ సుఖ్ నగర్ డిపో ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సమ్మె ముగియడంతో తాము ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డునపడ్డామని వాపోయారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాము అప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగాలు వదలి మరీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామన్నారు. తాము పర్మినెంట్ అయ్యే అవకాశం లభిస్తుందన్నఆశతో పనిచేశామని అన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు తాత్కాలిక ఉద్యోగుల గురించి స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts