మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లోని మిల్స్ యజమానులతో మరియు అధికారులతో వానాకాలం పంటల కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… రేపు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలను నేనే స్వయంగా పరిశీలిస్తా అని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పంటలు బాగా పండాయి.. రైతులు సంతోషంగా ఉన్నారు.. ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతులందరూ సన్నరకం సాగుపంటలనే అధికశాతం వేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తాం అని తెలిపారు. తెలంగాణలో మొదటి సారి చేతికొచ్చిన పంటలంటే హుజూరాబాద్ నియోజకవర్గంలోనే అని చెప్పిన ఆయన అకాల వర్షాలకు తడిసి రంగు మారిన వడ్లను కూడా కొనాలని రైస్ మిల్లర్ల యజమానులను కొట్టినట్లు వివరించారు. 20 రోజులపాటు రైస్ మిల్ యజమానులకు రైతులకు అనుసంధానంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి అని తెలిపారు.
previous post
next post
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ