నిన్న అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కుటుంబానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ట్విటర్‌లో స్పందిస్తూ.. ఆమెను నేను కలిసిన ప్రతిసారి ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అందరితో అభిమానం ప్రదర్శిస్తూ స్వాగతం పలికేవారు. ఆమె నిజమైన నేత అని పేర్కొన్నారు.
ప్రపంచంలో భారతీయులు ఏ ఆపదలో ఉన్నా కూడా సాయం చేయాలని కోరితే ఒక్క ట్వీట్‌తో తానున్నానే భరోసా కల్పించేవారు. మిమ్మల్ని మేం ఎంతో కోల్పోతున్నాం మేడమ్’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తూ మంత్రిగా ఉన్నప్పడు సుష్మాతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో విదేశాల్లో కష్టాల్లో ఉన్నామని ట్విటర్‌లో తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతీ సమస్యపై చాలా వేగంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు.
ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు: శ్రీకాంత్ రెడ్డి