telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ సమయంలో ధరలు పెంచితే కఠిన చర్యలు: పౌర సరఫరాల శాఖ

kirana shop

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో, లాక్‌డౌన్ ఉన్న కాలంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటన విడుదల చేసింది.

సరుకులను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు ప్రజలు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపింది. టోకు, చిల్లర వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Related posts