అందమైన పొదరింట మీ నవ్వులపంట
హృదయంలో గిలిగింత కావాలి మనసంతా
ఆనందం హద్దులుదాటి నిన్నుచేరగా
రాగాలసరాగాలలో మరిపించెను మది
తన్మయమో తమకమో తరించెను
ఎదసవ్వడి విదిలించగ విరహపు జడి
కనులలో నీ రూపు అలరించగా
వెచ్చని శ్వాస చినుకు చినుకులా తాకగా
పులకింతలే పుడమి నవ్వులా
తలపులే తనువంతా తడిపేస్తూ
జాలువారుతున్న జల్లులా
జ్ణాపకాలు అలవోకగా అల్లుకుపోతున్నాయి
కాలగమనంలో కలిసిపోతున్న గతంలా
మిగిలిపోకు ప్రతిరోజు పండువెన్నెల
పిల్లగాలిలా మెలివేసుకుపోవా
అంతరంగపు రారాజువై
అల్లుకుపోవా అణువనువు
నీ శ్వాసతో నిండిపోనా
సరసాల సమరంలో
శిలలా నిను చేరిన శిల్పాన్ని
కాదని వలదని కసిరించకు
కాలంలో కరిగిపోయే కలనేగా
కాసేపు కవ్వించరాదా
కలలోనైనా విసుగెందుకు
అదేపనిగా కలనైనందుకా
నిజంకాదని నిట్టూర్పా
వలచావా వస్తాను
తలచావా నిలుస్తాను
కాదన్నావా కనుమరుగవుతాను
కంటిపాపలా చూస్తావా
కౌగిలినై ఒదిగిపోతాను
నిరంతరం నీ నీడలో
శిశిరమై సాగిపోనా గుండె గుడిలో
వెచ్చని ఒడిలో