హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజక పరిధిలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేతులను బలపరుస్తామంటూ ముందుకు వస్తున్నారు.
ఇవాళ వీణవంక మండలం దేశాయి పల్లి గ్రామానికి చెందిన గౌడ, బుడగజంగాలు, మున్నూరు కాపు కుల సంఘాల వారు , ఉప సర్పంచ్ నల్ల సత్యనారాయణ రెడ్డి ఆద్వర్యంలో రెడ్డి సంఘం వారు టీఆర్‌ఎస్ లో చేరారు. నర్సింగాపూర్ గ్రామం నుండి పద్శశాలీ సంఘం నేతలు టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ రెండు గ్రామాల నుంచి దాదాపు 150 మంది టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దాం. కులవృత్తులను బలో పేతంచేసేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గొల్ల కురుమలకు గొర్రెలు మత్స్యకారులలకు చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేశారు అన్నారు. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి పంపిణీ చేసి రైతును రాజుగా మార్చారు.
ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు. నేటి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ. దేశంలో అత్యధికంగా వరి పంట పండించే పంజాబ్ ను వెనక్కు నెట్టి, తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది అన్నారు. యాసంగిలో 3 కోట్ల మెట్రిక్‌టన్నులవరి పంట పండించి తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమయింది. ఇది అవుతుందా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటికొరత లేకుండా చేశారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజూరాబాద్ అని అన్నారు.
నేడు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసు. తన స్వార్థం కోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఈ ఎన్నికలు. మంత్రిగా పేదల కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఇళ్లు నిర్మించి ఇస్తారా. వ్యక్తి ప్రయోజనమా…హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలా…మీరే ఆలోచించండి అన్నారు. నిరంతరం మీ కోసం పని చేసే సీఎం కు హుజూరాబాద్ గెలుపు కానుకగా ఇద్దాం. హుజూరాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అని అన్నారు. ఈ కార్యక్రమం లో దేశాయిపల్లి, నర్సింగాపూర్ నేతలు నల్ల మహేందర్ రెడ్డి, ఉయ్యాల చంద్రమౌళి, సాంబయ్య, తిరుపతి, దేవేందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు తనిఖీపై హంగామా అవసరం లేదు: మంత్రి బొత్స