telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమ్‌స్టర్‌డామ్‌ : … 8వ ఖండాన్ని కనుగొన్న.. నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు ..

Scientists discovered eighth continent

నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ వెలుగు చూడని 8వ ఖండాన్ని కనుగొన్నారు. ఇది మధ్యధరా ప్రాంతంలోని సంక్లిష్టమైన భౌగోళిక శాస్త్ర పరిణామక్రమాన్ని శోధిస్తున్న సమయంలో కనిపించింది. అది ఊహాజనిత దీవి ‘అట్లాంటిస్‌’ కాదని వారు చెప్పారు. గ్రీన్‌లాండ్‌ పరిమాణంలో ఉన్న ఈ ఖండానికి ‘గ్రేటర్‌ ఆడ్రియా’ అని పేరు పెట్టారు. దాదాపు 14 కోట్ల ఏళ్ల కిందట ఇది ఉత్తర అమెరికా నుంచి విడిపోయి దక్షిణ ఐరోపా కిందకు చేరిపోయింది.

పర్వత శ్రేణుల పరిణామక్రమాన్ని పరిశోధించడం ద్వారా ఖండాల ఆవిర్భావాన్ని కనుగొనడం వీలవుతుంది. మేము పరిశోధించిన అనేక పర్వత శ్రేణులు 20 కోట్ల ఏళ్ల కిందట ఉత్తర ఆఫ్రికా నుంచి విడిపోయిన ఒక ఖండం నుంచే వచ్చాయి. ఈ ఖండంలో మిగిలిన భాగం టురిన్‌ నుంచి ఆడ్రియాటిక్‌ సముద్రం గుండా ఇటలీ వరకూ విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని భూగర్భశాస్త్రవేత్తలు ఆడ్రియాగా పిలుస్తున్నారు. అందువల్ల తాజాగా గుర్తించిన ఖండానికి గ్రేటర్‌ ఆడ్రియాగా నామకరణ చేశామని పరిశోధనకు నాయకత్వం వహించిన వాన్‌ హిన్స్‌బర్గెన్‌ చెప్పారు.

Related posts