telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రాహుల్ గాంధీ కి .. తప్పని ఒకే పేర్ల స్టంట్ .. రాజకీయంలో కొత్త కోణం.. !

Rahul was in active politics

రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేశాక అదే పేరున్న మరో ముగ్గురు అభ్యర్థులు వయనాడ్‌ బరిలో తలపడటానికి సిద్ధమయ్యారు. కొట్టాయంకు చెందిన ముప్ఫై మూడేళ్ల కె.ఈ.రాహుల్‌ గాంధీ, కోయంబత్తూరుకు చెందిన ముప్ఫై ఏళ్ల కె.రఘుల్‌ గాంధీ(అఖిల భారత మక్కల్‌ ఖజకం పార్టీ), త్రిస్సూర్‌కు చెందిన నలభై ఏళ్ల కె.ఎమ్‌.శివప్రసాద్‌ గాంధీలు వయనాడ్‌ స్థానం నుంచి నామినేషన్లు వేశారు. కె.ఈ.రాహుల్‌ గాంధీ భాషలు, సామాజిక సేవ అనే అంశాల్లో పీహెచ్‌డీ చేశారు. భార్య గృహిణి. వీరికి అప్పులు, స్థిరచరాస్తులేమీ లేవు. చేతిలో ఐదు వేల రూపాయలు, బ్యాంకులో రూ.515 మాత్రమే ఉన్నాయి.

ఇక వీరు నామినేషన్ పాత్రలలో వెల్లడించిన వివరాల ప్రకారంగా, కె.రఘుల్‌ గాంధీ రిపోర్టర్‌. ఆయన భార్య దంతవైద్యురాలు. రఘుల్‌ లక్షాతొంభై తొమ్మిదివేల రూపాయలు, ఆయన భార్య రెండు లక్షలరూపాయల జీతం అందుకుంటున్నట్టు ఆదాయపు పన్నుల వివరాలు పొందుపరిచారు. వీరిరువురికీ 1,45,000 రూపాయల అప్పున్నట్టు పత్రాలు సమర్పించారు. కె.ఎమ్‌.శివప్రసాద్‌ గాంధీ సంస్కృతం ఉపాధ్యాయుడు, అతని భార్య కంప్యూటర్‌ ఉద్యోగిని. వీరు ఉన్నత కుటుంబానికి చెందిన వారే!

Related posts