telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

వీర్యకణాలు లోపంతో బాధపడుతున్నారా !

ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనం ఎన్నో అనారోగ్యాలకు గురవుతుంటాం. ఎందుకంటే.. ప్రస్తుత పోటీ తత్వానికి బిజీ లైఫ్‌ గడపకపోతే.. మనం ముందుకు వెళ్లలేం. దీంతో మన ఆరోగ్యాలు చేడు పోతున్నాయి. ముఖ్యంగా సంతానం, వీర్యకణాల తగ్గుదల లాంటి సమస్యలు అందరినీ ఇబ్బంది పెడుతోంది. అయితే.. ఈ సమస్యలకు ఇలా చెక్‌ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
బీట్‌ రూట్‌లో బీటా కెరాటిన్‌, విటమిన్‌ సి, విటమిన్‌-ఈ అధికంగా ఉంటాయి. వీటిద్వారా మన శరీరంలో కొత్త కణాలు వేగంగా ఉత్పత్తి చెంది నూతన ఉత్తేజాన్ని పొందవచ్చు. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. తరచుగా బీట్‌రూట్‌ తినడం వల్ల ఇవి మన శరీరానికి అందుతాయి. సంతానోత్పత్తి కోసం యత్నిస్తున్న వారు బీట్‌రూట్‌ కచ్చితంగా తింటారు. బీట్‌రూట్‌ తినడం వల్ల వీర్యకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయి సంతానోత్పత్తిలో దోహదం చేస్తుంది. బీట్‌రూట్‌ ద్వారా లభించే విటమిన్‌ బి6, పోలిక్‌ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి ఖనిజ లవణాలు, పోషకాలు అందుతాయి. ఇవి ప్రాణాంతక క్యాన్సర్‌ కణాలను కొంత మేర నాశనం చేస్తాయి. బీట్‌ రూట్‌ తినడం ద్వారా అందే నైట్రేట్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు తగినంత రక్త ప్రవాహాన్ని అందించడంలో దోహదం చేస్తుంది.

Related posts