మనసు ఒక మంచు పర్వతం…
మాట వినదుగా…
వద్దని వారించినా.. కాదని ఖండించినా..
అదెప్పుడూ కరుగుతూనే వుంటుంది..!
కనురెప్పలతో ఆనకట్టలెన్ని కట్టినా..
అణగని ఆవేదనాఝరులు..
ఝంఝూమారుతంలా త్రోసుకుని వచ్చి..
గుండెలోతుల్లోకి జారిపోతుంటాయి..!
“హిమపాతాలై” ఉరికివచ్చే జలపాతాలు..
కనులను ఆర్తిగా ఆలింగనం చేసుకుని
చెక్కిళ్ళతో చెలిమి చేస్తుంటాయి…!
వర్షానికి ఋతువులుంటాయి
కానీ..
ఊటలా ఉబికి వచ్చే..
కన్నీటికి కాలువలే తప్ప..
కాలాలుండవెందుకో….!
విసుగు విరామం లేకుండా..
కరుగుతూ.. కదులుతూ..
గుండెలోని తడిని పిండేస్తుందేమిటో..!
కానీ.. కరగనీ….
కలతలన్నీ పోయేలా..
కష్టాలకు విసుగొచ్చేలా..
హోరుమని.. భోరుమనీ..
జడివానలా ఎదపై కురవనీ….!
కన్నీటితో దేహాన్ని స్నానించనీ…!
కనులు వేదనను వర్షిస్తున్నా….
పెదవులతో.. నవ్వడమే మన పని…!!
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్