telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

14 రోజులు లాక్ డౌన్ : ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.. కేసులు  పెరుగుతున్న  నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడి నేతృత్వంలో ఉన్నత స్థాయు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక లలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో రాష్ట్రం లాక్ డౌన్ విధించింది. మే 05 నుంచి 19 వరకు అంటే 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది ఒడిషా ప్రభుత్వం. ప్రజలు ఎవరూ రాకూడదని సూచనలు చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను బంద్ చేస్తున్నట్లు పేర్కొంది. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి పగలు 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది. కాగా మన తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Related posts