telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పీవీపీ నుంచి కాపాడండి.. జగన్ కు బండ్ల గణేశ్ ట్వీట్

bandla ganesh in bigg boss 3 conditions apply

ఏపీ తన చేతుల్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ బెదిరిస్తున్నారని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆరోపించారు. పీవీపీ నుంచి తనను కాపాడాలని బండ్ల గణేశ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి… సార్ మమ్మల్ని అందరినీ పీవీపీ బారి నుంచి కాపాడండి” అని ఆయన ట్వీట్ చేశారు.

“రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్” అని, “ఓడిపోయిన కేసులలో కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే… ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు” అని ఆరోపించారు.

“అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనందపడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు. వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది” అని మరో ట్వీట్ ను కూడా బండ్ల గణేశ్ పెట్టారు. “మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు, దయచేసి కట్టడి చేయండి” అని కోరారు.

Related posts