ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఓ టెలిఫోన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంలెవరంటూ చేపట్టిన ఈ సర్వేలో నెంబర్ వన్ గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పట్టం కట్టారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 4వ ర్యాంకు దక్కగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 7వ స్థానంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలవగా, తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానం దక్కించుకున్నారు.
ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..?: జగన్ తీవ్రవ్యాఖ్యలు