కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని సిద్దిపేట కు వెళ్తుండగా అరెస్ట్ చేసారు పోలీసులు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ ఇంట్లో అలాగే అతను బంధువుల ఇంట్లో పోలీసులు తనిఖీలు చెప్పట్టారు. ఇందులో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. స్వాధీనం చేసుకున్న నగదును లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకుని బీజేపీ నేతలు అలాగే బండి సంజయ్ సిద్దిపేట కు బయల్దేరారు. కానీ సిద్దిపేట లో సంజయ్ ని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ సమయంలో పోలీసులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్ ని సిద్దిపేట నుండి కరీంనగర్ కి తీసుకెళ్తున్నారు పోలీసులు. అయితే నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని… తన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లే హరీశ్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
previous post