telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 8, బుధవారం రాశిఫలాలు..

మేషరాశి..

ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. నూతన ఉద్యోగయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృషభరాశి..

నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

మిథునరాశి..

కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు మంచి జ‌రిగే సూచనలు ఉన్నాయి. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కర్కాటకరాశి..

కొంతమంది మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.

సింహరాశి..

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు పై అధికారులు నుంచి ప్రశంసలు లభిస్తాయి.ఆలయాలు సందర్శిస్తారు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్యరాశి..

ప్రయాణాలు విజయవంతమవుతాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. బంధువులు, మిత్రులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

తులరాశి..

బంధువుల నుంచి ఒత్తిడులు ఎదుర‌వుతాయి.సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. దైవ‌కార్యాల‌యాల్లో పాల్గొంటారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర‌వుతాయి. అప్పులు చేయ‌డం వ‌ల‌న ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చికరాశి..

బంధువులతో సఖ్యత ఏర్ప‌డ‌డుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహన, గృహయోగాలు ల‌భిస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం త‌ప్ప‌దు.

ధనుస్సురాశి..

ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. కుటుంబంలో సమస్యలు ఎదుర‌వుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.

మకరరాశి..

సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు అందుతాయి. ముఖ్య పనులు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ల‌భిస్తుంది.

కుంభరాశి..

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మ‌ధ్య‌మంగా ఉంటాయి.

మీనరాశి..

స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. ఉమ్మడి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. చర్చలు సఫలం అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

Related posts